రంగురంగుల బాణాసంచా పేల్చుతుంటే చూడ్డానికెళ్లాడు..త‌ల‌పై ప‌టాకులు పేలి!

ఆకాశంలో రంగురంగుల బాణాసంచా పేలుతుంటే.. వాటిని చూడ్డానికెళ్లాడో బాలుడు. ఇక అంతే! మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి రాలేదు. ఆ బాలుడి త‌ల‌పై ప‌టాకులు ప‌డి పేల‌డంతో, దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు.

ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. ఆ బాలుడి పేరు ధ‌నుష్‌. బెంగ‌ళూరులోని కేంబ్రిడ్జి లేఅవుట్‌లో త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నివాసం ఉంటున్నాడు.

త‌న ఇంటికి స‌మీపంలోని లూర్ధు చ‌ర్చిలో ఆదివారం రాత్రి బాణాసంచా పేల్చుతుంటే చూడ్డానికి వెళ్లాడు. ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి రెండో ఆదివారం ఈ చ‌ర్చిలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుతుంటారు.

వాటిని చూడ్డానికి పెద్ద ఎత్తున స్థానికులు వ‌స్తుంటారు. ధ‌నుష్ కూడా వెళ్లాడు. బాణాసంచా పేల్చుతుంటే ఆనందంగా చూడ‌సాగాడు. అనూహ్యంగా ఓ ప‌టాకి ధ‌నుష్ త‌ల మీద ప‌డి పేలిపోయింది.

దీనితో ధ‌నుష్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. వెంట‌నే అత‌ణ్ణి ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డ చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. త‌మ చిన్నారి ధ‌నుష్ హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై హ‌లసూర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here