స్కూల్ బ‌స్ ఎంత వేగంగా బైక్‌ను ఢీ కొట్టిందంటే..ముగ్గురు స్పాట్ డెడ్!

ఓ ప్రైవేటు విద్యాసంస్థ బ‌స్సు బైక్‌ను ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో న‌లుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావి జిల్లా చిక్కోడిలో చోటు చేసుకుంది.

జిల్లాలోని అథ‌ణి తాలూకా ఖేత‌న‌ట్టి క్రాస్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఐగ‌ళి గ్రామంలోని మాణిక్య ప్ర‌భు స్కూల్ బ‌స్సు గ్రామం నుంచి విద్యార్థుల‌ను తీసుకుని వెళ్తుండ‌గా.. సంకేశ్వ‌ర-జీవ‌ర్గీ మ‌ధ్య ప్ర‌మాదానికి గురైంది.

స్కూల్ బ‌స్సు అదుపు త‌ప్పి ఎదురుగా వ‌స్తోన్న బైక్‌ను ఢీ కొట్టింది. బైక్‌పై ప్ర‌యాణిస్తోన్న ముగ్గురూ అక్క‌డికక్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

మృతుల‌ను దాన‌ప్పా మ‌గ‌దుమ్మ‌, మ‌నోహ‌ర దొడ్డ‌మ‌ని, అప్పాసాబ మ‌రాఠ‌ల‌తో పాటు రోడ్డు ప‌క్క‌న ఉన్న మ‌రో వ్య‌క్తి సిద్ధ‌గిరి పూజారిగా గుర్తించారు.

స్కూల్ బ‌స్సులో ఉన్న 12 మంది విద్యార్థులు కూడా గాయ‌ప‌డ్డారు. వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది.

వారిని మ‌హారాష్ట్రలోని మిరాజ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మిగిలిన విద్యార్థుల‌ను అథ‌ణి తాలూకా ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఐగ‌ళి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here