రాత్రికి రాత్రి నదిలోని నీళ్లంతా ఎర్రగా మారిపోయాయి.. భూమి అంతం అవ్వబోతోందంటూ..!

మీ ఇంటికి దగ్గరలోనో.. ఊరి చివరనో పారుతున్న నది ఉన్నట్లుండి ఎర్రగా మారిపోతే ఎవరికైనా భయమే కదా..! ప్రస్తుతం రష్యా లోని ట్యూమెన్ వాసులకు అదే భయం చుట్టుకొంది. వారి ఊరిలో ప్రవహిస్తున్న నదిలోని నీరు ఒక్క రాత్రిలో ఎర్రగా మారిపోయాయి.. దీంతో ప్రళయం సంభవిస్తుందేమోనని భయపడిపోతున్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోకండి అని అధికారులు చెబుతున్నారు.

ట్యూమెన్ అనే ఊరిలో నుండి మోల్చంకా అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడూ తెల్లగా ఉండే నది ఒక్కసారిగా ఎరుపు రంగు పులుముకుంది. దీంతో ఆ ఊరి వాళ్ళు.. అధికారులు తెగ భయపడిపోయారు. ప్రస్తుతం అధికారులైతే ఆ నీటికి సంబంధించిన చిన్న చిన్న శాంపుల్స్ ను తీసుకొన్నారు. త్వరలో వాటి రిజల్ట్స్ రానున్నాయి. ఎవరైనా అధికమొత్తంలో కెమికల్స్ ను కలపడం వలన ఇలా ఎరుపు రంగులో నది మారిందని స్థానికులు కొందరు అంటున్నారు.

దాదాపు ఒక వారం రోజులుగా నది మొత్తం ఎరుపు-నారింజ రంగు కలర్ లో ఉందని స్థానికులు అంటున్నారు. ఇది చాలా తీవ్ర పరిణామం అని స్థానికులు చెబుతూ ఉన్నారు. గతంలో నీరు అన్నది ఇలా ఎప్పుడూ మారలేదని.. చాలా భయమేస్తోందని స్థానికులు అంటూ ఉన్నారు. నది అలా ఎరుపుగా ఉండడం వలన ఆ నది చుట్టూ బ్రతుకుతున్న వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నీటిలోకి ఏమి కలిపారో.. లేక నది మొత్తం ఎరుపుగా మారిపోయిందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మరి కొందరు బైబిల్ లోని కొన్ని వ్యాఖ్యాల కారణంగా ప్రపంచం అంతం అవడానికి ఇవి సాక్ష్యాలు అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here