కాజ‌ల్ ప్రేమ‌గా ముద్దాడుతోన్న ఆ బాబెవ‌ర‌నుకున్నారు?

ముంబై: న‌టి నిషా అగ‌ర్వాల్ గుర్తుందా? తెలుగు, త‌మిళ సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ సోద‌రి. `సోలో`, `సుకుమారుడు`, `ఏమైంది ఈవేళ‌..` వంటి సినిమాలో గుర్తింపు తెచ్చుకున్న న‌టి.

పెళ్లి చేసుకుని సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన నిషా అగ‌ర్వాల్ గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చారు. ఆ బాబుకు ఇషాన్ అని పేరు పెట్టారు. ఇప్పుడా బాబు.. కాజ‌ల్ అగ‌ర్వాల్ హ‌ఠాత్తుగా వార్త‌ల్లోకి ఎక్కారు.

కార‌ణం.. ఇషాన్‌ను ముద్దాడుతున్న ఫొటోను కాజ‌ల్ అగ‌ర్వాల్ తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను పిన్ని అయినందుకు గ‌ర్వంగా ఉంద‌ని చెప్పారు. బాబుని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. `మా చిన్నారి ఇషాన్‌ను చూశారా..` అంటూ కామెంట్స్ పెట్టారు.

2013లో నిషా అగర్వాల్‌..వ్యాపారవేత్త కరణ్‌ వలేచాను వివాహం చేసుకుంది. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఆమె ముంబై ఆసుప‌త్రిలో బాబుకు జ‌న్మ‌నిచ్చారు.

https://twitter.com/MsKajalAggarwal/status/966320894925668354

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here