టాయ్‌లెట్ నిర్మాణానికి ఇటుక‌లెత్తిన త్రిష‌

ప్ర‌ముఖ న‌టి త్రిష‌.. త‌న చేతుల‌తో టాయ్‌లెట్ నిర్మాణానికి ఇటుక‌లెత్తారు. ద‌గ్గ‌రుండి టాయ్‌లెట్ నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షించారు. యూనిసెఫ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న త్రిష‌.. స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్‌లో భాగంగా టాయ్‌లెట్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు.

త‌మిళ‌నాడు కాంచీపురం జిల్లాలోని నెమ్మెలి గ్రామంలో వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె స్వ‌యంగా నిర్మాణ ప‌నుల్లో దిగారు. త‌న చేతుల‌తో సిమెంట్ క‌లిపారు.

ఇటుక‌తో గోడ‌ను క‌ట్టారు. ఆరు గంట‌ల పాటు ఆమె నెమ్మెలి గ్రామంలో గ‌డిపారు. స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్‌పై గ్రామీణుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల అవ‌స‌రాన్ని, బ‌హిరంగ మ‌ల‌, మూత్ర విసర్జ‌న వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను వివ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here