పెళ్లి చేసుకున్న క్ష‌ణం నుంచీ ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు..!

చిత్ర‌దుర్గ‌: ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఓ జంట బెదిరింపుల‌ను ఎదుర్కొంటోంది. అయిన వాళ్లే వారిని చంపేస్తామ‌ని రోజూ ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారు. త‌మకు ప్రాణ‌హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతూ ఆ జంట ఎస్పీ కార్యాల‌యాన్ని ఆశ్ర‌యించారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిత్రదుర్గ జిల్లాలో చోటు చేసుకుంది.

చిత్ర‌దుర్గ‌కు చెందిన మారుతి, రుక్సార్ (పేర్లు మార్చాం) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చిక్క‌మ‌గ‌ళూరుకు చెందిన రుక్సార్ త‌ల్లిదండ్రులు ఆరేళ్ల కింద‌ట చిత్ర‌దుర్గ‌కు వ‌చ్చి, స్థిర‌ప‌డ్డారు. అదే ప్రాంతానికి చెందిన మారుతిని రుక్సార్ ప్రేమించింది. వారి పెళ్లికి రెండు కుటుంబాల వారూ అంగీక‌రించ‌లేదు.

దీనితో చిత్ర‌దుర్గ స‌మీపంలోని జాన‌కొండ రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో పెళ్లి చేసుకున్నారు. అప్ప‌టి నుంచి వారికి బెదిరింపులు వ‌స్తూనే ఉన్నాయి.

త‌మ ప‌రువు తీశార‌ని, జీవించి ఉండ‌టానికి అర్హ‌త లేద‌ని అంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదిరింపులు అందుతున్నాయని వారు చెప్పారు. త‌మ‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతూ మారుతి, రుక్సార్‌.. చిత్ర‌దుర్గ ఎస్పీ కార్యాల‌యాన్ని ఆశ్ర‌యించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here