ఆ కార‌ణంతోనే ఐసీయూలో ఉన్న అన్ని సీసీటీవీల క‌నెక్ష‌న్ల‌నూ తొల‌గించాం!

చెన్నై: త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణించిన ఉదంతంలో ఓ షాకింగ్ ట్విస్ట్ తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. జ‌య‌ల‌లిత అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుప‌త్రి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలో అక్క‌డి అన్ని సీసీటీవీల క‌నెక్ష‌న్ల‌ను తొల‌గించార‌ట‌.

ఈ విషయాన్ని చెప్పింది ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ అపోలో ఆసుప‌త్రి గ్రూప్ సంస్థ‌ల ఛైర్మ‌న్ డాక్ట‌ర్ ప్ర‌తాప్ సీ రెడ్డి వెల్ల‌డించారు. చెన్నైలో ఏర్పాటైన అపోలో ఇంట‌ర్నేష‌న‌ల్ కొలోరెక్ట‌ల్ సింపోజియం సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానాల‌ను ఇచ్చారు.

ఐసీయూలో మొత్తం 24 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని.. అక్క‌డ చికిత్స తీసుకుంటున్న రోగులంద‌ర్నీ ఇంకో ఐసీయూకు త‌ర‌లించామ‌ని అన్నారు. జ‌య‌ల‌లిత‌ను మాత్ర‌మే ఐసీయూలో ఉంచి, చికిత్స అందించామ‌ని చెప్పారు. ఆమెను ఎవ్వ‌రూ చూడ‌కూడ‌ద‌నే ఒకే ఒక్క కార‌ణంతో ఐసీయూలో అమ‌ర్చిన అన్ని సీసీటీవీ కెమెరాల క‌నెక్ష‌న్ల‌ను తొల‌గించిన‌ట్లు చెప్పారు.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై ద‌ర్యాప్తు జ‌రుపుతోన్న జ‌స్టిస్ ఆర్ముగ‌స్వామి క‌మిష‌న్‌కు.. ఆసుప‌త్రి త‌ర‌ఫు నుంచి అవ‌స‌ర‌మైన అన్ని డాక్యుమెంట్ల‌ను అంద‌జేశామ‌ని చెప్పారు. జ‌య‌ల‌లిత ఓ ముఖ్య‌మంత్రి అని, ఆమెకు అందించే చికిత్స‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డం ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల్లే సీసీటీవీల క‌నెక్ష‌న్ల‌ను తొల‌గించామ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here