బాలయ్య మీద ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు..!

తెలుగుదేశం నాయకుడు.. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! అయితే దీనిపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఇప్పటికే పలువురు బాలయ్యను దూషించారు కూడా.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావ్ బాలకృష్ణ అని కూడా అన్నారు. చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దీక్షలో నిన్న బాలయ్య ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. మోదీ ఇష్టమొచ్చినట్లు పాలించడానికి ఇది గుజరాత్ కాదని, ఆంధ్రప్రదేశ్ అని బాలకృష్ణ అన్నారు. తెలుగువారు పిరికివాళ్లు కాదని… తెలుగువారి సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. అలాగే ఓ పెద్ద బూతును కూడా తిట్టాడు బాలయ్య..!

 


అయితే ఈ రోజు ఉదయం ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉండి… దేశ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని… బాలయ్య చేసిన వ్యాఖ్యల వీడియోను పరిశీలించి… ఆయనపై చర్యలు తీసుకోవాలని నరసింహన్‌ను కోరారు. అలాగే ఓ వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజా ప్రతినిధిగా కొనసాగే హక్కు ఏ మాత్రం లేదని లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here