జూబ్లీహిల్స్ పోలీసులను పట్టుకొని చితక్కొట్టిన యువకుడు.. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారా అంటూ..!

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ సెలెబ్రిటీలను కూడా ఏ మాత్రం వదలని జూబ్లీహిల్స్ పోలీసులతో గత రాత్రి ఓ యువకుడు ఆటాడుకున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు ఫుల్‌‌గా మందుకొట్టిన మందు బాబును గుర్తించారు. కారును సీజ్ చేయడానికి పోలీసులు యత్నించగా కారులోనుంచి దిగిన యువకుడు దిగి రచ్చరచ్చ చేశాడు. కారు నడిపే వ్యక్తి ఊరికే ఉన్నప్పటికీ అతని పక్కనే కూర్చున్న స్నేహితుడు పోలీసుల మీదకు ఎగబడ్డాడు.

పీకల్లోతు తాగిన మైకంలో ఉన్న అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత బాహాబాహీకి దిగాడు. ఏ మాత్రం కూడా భయపడకుండా పోలీసుల మీదకు ఎగిరి దూకాడు. దీంతో పోలీసులు బూటు కాలితో మందుబాబును ఎగిరెగిరి తన్నారు. ఆ తర్వాత అతడు కూడా పోలీసుపై చేయెత్తి కొట్టాడు. కొద్ది సేపటి వరకూ ఆ గొడవ కొనసాగుతూ పోయింది. చివరికి ఓ ఉన్నతాధికారి వచ్చి గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టి యువకుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కారును సీజ్‌ చేసి స్థానిక పీఎస్‌కు తరలించారు. ఆ యువకుడు ఎవరు అన్న విషయమై పోలీసులు ఆరాతీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here