మిచెల్ జాన్సన్ తలకు తీవ్ర గాయం.. ఎలా అయిందంటే..!

ఆస్ట్రేలియా పేస్ గన్ మిచెల్‌ జాన్సన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ నాలుగు ఫోటోలు మిచెల్ జాన్సన్ ఇంస్టాగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయి.. అందులో జాన్సన్ తల మీద తీవ్ర గాయం అవ్వడం మనం గమనించవచ్చు. అతడు పడుకొని ఉండగా.. తలకు కుట్లు వేసిన ఫోటోలు ఉన్నాయి. ఇక చివరి ఫోటోలో మిచెల్ జాన్సన్ తనకు ఏమీ అవ్వలేదు అన్నట్లు నవ్వుతూ కనిపించాడు. తనకు రక్తం అంటే ఇష్టం లేదని.. అలాగే ఈ ఫోటోలను కూడా మళ్ళీ చూడాలని అనుకోవడం లేదని చెప్పాడు జాన్సన్. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పుకొచ్చాడు జాన్సన్.


జిమ్‌ లో చిన్ అప్ బార్ ఎక్సర్‌ సైజ్‌ చేస్తూ కిందపడ్డాడు. ఆ బార్ అతని తలపై పడడంతో అతని తలకు రెండు అంగుళాల వెడల్పుగా తీవ్రగాయమైంది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స చేసిన వైద్యులు 16 కుట్లు వేసి, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అతని తలకు 16 కుట్లు పడడం కోల్ కతా నైట్ రైడర్స్ లో ఆందోళన రేపుతోంది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మిచెల్ జాన్సన్ ను 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న మిచెల్ జాన్సన్ ఐపీఎల్ లో ఆడుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here