మే 30, 31.. అంటే రేపు,ఎల్లుండి బ్యాంకుల బంద్.. 48 గంటల సమ్మె..!

ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపునిచ్చారు. 48 గంటల సమ్మెకారణంగా రేపు, ఎల్లుండి (మే 30, 31) బుధ, గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకులు పని చేయవు. మళ్లీ బ్యాంకులు తెరుచుకునేవి శుక్రవారమే. బ్యాంక్ ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులు. కనీసం 5శాతం జీతాల పెంపును డిమాండ్ చేయగా.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేవలం 2శాతం మాత్రమే పెంచటానికి ఒప్పుకుంది. దీంతో సమ్మెకు పిలుపు నిచ్చారు ఉద్యోగులు.

ఆల్ ఇండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఈ సమ్మెకి మద్దతు ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మే 30, 31 తేదీల్లో పూర్తిగా లావాదేవీలు నిలిచిపోనున్నాయి. నెలాఖరు కావటంతో మే 31వ తేదీన జీతాలు చెల్లించే సంస్థల ఉద్యోగుల ఖాతాల్లోకి ఈరోజే జీతాలు వేస్తున్నాయి. నెల చివరిలో రెండు రోజులు బ్యాంకులు పనిచేయకపోవటంతో.. జూన్ 1, 2 తేదీల్లో జీతాలు చెల్లింపులోనూ కొంత ఆలస్యం కావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here