అదృష్టమంటే ఆ పిల్లాడిదే..!

అదృష్టమంటే ఆ పిల్లాడితే.. లేకపోతే తల్లి కళ్ళ ముందే బస్సు కింద పడిపోయేవాడు. చిన్న పొరపాటు అతడిని బస్సు కింద పడిపోయేలా చేసేది. కావాలంటే మీరు కూడా ఆ వీడియో చూడండి.


ఈ ఘటన చైనా లోని చోన్‌క్వింగ్‌లో చోటు చేసుకుంది. ఆరేళ్ల పిల్లాడు తన తల్లితో కలిసి పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్నాడు. తల్లి వెనుక నడుచుకుంటూ వస్తుండగా.. ఆ పిల్లాడు ముందు నడుచుకుంటూ వెళుతున్నాడు. అక్కడే రోడ్డు కూ ఫుట్ పాత్ కూ మధ్య ఓ చిన్న ఇనుప రైలింగ్ ఉంది. అక్కడ ఆడుకుంటూ పరుగెడుతూ వెళుతూ ఆ ఇనుప రైలింగ్ కు తగిలి ఒక్కసారిగా అదుపుతప్పి బస్సు కింద పడబోయాడు. అయితే కొద్ది సెకెండ్లలో అతడు తప్పించుకొన్నాడు. వెంట్రుక వాసి దూరంలో ఆ బస్సు వెళ్ళిపోయింది. కిందపడిపోయిన ఆ చిన్నారిని అతడి తల్లి లేపి తీసుకెళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here