187 రూపాయలకే అన్ లిమిటెడ్ ఆఫర్ ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్..!

కేవలం 187 రూపాయలకే ప్రభుత్వ రంగ మొబైల్ సంస్థ భారత సంచర్ నీగమ్ లిమిటెడ్ అన్ లిమిటెడ్ ఆఫర్ ను ప్రకటించింది. టెలీకాం రంగంలో ఉన్న పోటీని తట్టుకోడానికి బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ను ప్రకటించింది. జీఎస్ఎం ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎస్‌టీవీ (స్పెషల్ టారిఫ్ వోచర్) ఆఫర్‌లో రూ. 187 రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ వినియోగ దారులు రూ.187తో రీచార్జ్ చేసుకుంటే నెలపాటు 1జీబీ వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమితి కాలం 28 రోజులు ఉంటుంది.

 

1జీబీ డేటా దాటిన తరువాత డేటా స్పీడ్ కాస్త 40 కెబీపీఎస్‌కు తగ్గిపోతుంది. 1జీబీ డేటాతో పాటుగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్/ఎస్టీడీ)ను అందిస్తోంది. ఈ కాల్స్‌ను అన్ని టెలికం ఆపరేట్ నెంబర్లకు చేయవచ్చనని తెలిపింది. ఇతర నెట్‌వర్క్‌లతో పాటుగా బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్‌కు కూడా 28 రోజుల పరిమితకాలంలోపు నెట్ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. జియోలో ఉన్న ఫ్రీ కాలర్ ట్యూన్ ఆఫర్ లాగా బీఎస్ఎన్ఎల్‌ లో పీఆర్‌బీటీ (పర్సనలైజ్‌డ్ రింగ్ బ్యాక్ టోన్) సర్వీసు అందిస్తోంది. మనం ఎవరికైనా కాల్ చేస్తే ఏది పడితే అది కాకుండా మనం ఎన్నుకున్న పాటను వినవచ్చు. ఈ ఆఫర్‌ నేషనల్ రోమింగ్ ప్రాంతాలైన ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు కూడా కాల్స్ చేసుకోవచ్చునని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here