అక్కడా, ఇక్కడా కాదు టాలీవుడ్ సెక్స్ స్కాండల్ ఏకంగా దేశ సరిహద్దులను దాటేసింది. ఆ మాట కొస్తే ఖండాంతరాలను దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో తిష్ట వేసింది. అమెరికాలోని చికాగో సిటీ కేంద్రంగా ఈ సెక్స్ రాకెట్ పనిచేస్తోంది. భార్యా, పిల్లలను స్వదేశంలో వదిలి పెట్టి, ఉద్యోగం చేస్తూ ఒంటరిగా అమెరికాలో స్థిరపడిన తెలుగు వారిని టార్గెట్‌గా చేసుకుని ఈ సెక్స్ రాకెట్‌ను నడిపించినట్లు చెబుతున్నారు.
కొన్ని భారీ సినిమాలకు కూడా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్ర.. ఈ సెక్స్ రాకెట్‌ను నడిపిస్తున్నారు. మోదుగుమూడి కిషన్ అంటే టాలీవుడ్‌కు పెద్దగా పరిచయం ఉండదు గానీ.. విభా జయమ్ అంటే మాత్రం టాలీవుడ్ మొత్తానికీ చిర పరిచితం. దీనికి కారణం.. విదేశాల్లో సినిమా షూటింగులు, ఈవెంట్స్, టెలీ సీరియళ్లకు ఏర్పాట్లు చేసేది ఆయనే కాబట్టి.
ఇలా తనకు మంచి గుర్తింపు లభించడంతో.. కొందరు హీరోయిన్లు యాంకర్స్‌ని సినిమా షూటింగ్‌లు, ఈవెంట్స్ పేరుతో తాత్కాలిక వీసా ఇప్పించి అమెరికాకి తీసుకెళ్ళడం, అక్కడ ఖరీదైన హోటల్స్‌లో వారిని ఉంచి విటులని పంపించే వృత్తిలోకి దిగాడు. దీనికి అతని భార్య చంద్ర కూడా సహకరించింది. ఈ సెక్స్ స్కాండల్‌ను అమెరికా పోలీసులు బట్టబయలు చేశారు.
హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారి వద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి మూడు వేల డాలర్లు వసూలు చేస్తారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు విషయంలో పూర్తిగా విచారణ జరిపి త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
పోలీసులు కిషన్, చంద్రల మొబైల్స్ స్వాధీనం చేసుకొని వారి సోషల్ నెట్వర్క్స్తో పాటు మెయిల్స్‌ని కూడా చెక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో పలు కండోమ్ ప్యాకెట్స్ కూడా దొరికినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఓ హీరోయిన్ తనని మానసిక క్షోభ గురి చేయోద్దని ఇలాంటి బిజినెస్‌లో నన్ను భాగం చేయోద్దంటూ వేడుకున్న మెయిల్ ఒకటి దర్యాప్తులో దొరికిందని పోలీసులు అన్నారు. చాలా కాలంగా సెక్స్ రాకెట్ నడుపుతున్న కిషన్ తెలుగు హిట్ సినిమాలకి కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు.