మనిషికి మనిషే సాయం.. ఇదే ఈ వీడియో..!

ఆపదలో ఉన్న మనిషికి సాటి మనిషే సాయం అని అంటారు. ఆ విషయాన్ని గుర్తు చేసే ఘటనే ఇది..! నీటిలో మునిగిపోతున్న కారులో ఓ మహిళ ఉంది. డోర్లు జామ్ అవ్వడం వలన ఆమె బయటకు రాలేకపోయింది. ఆమెను గమనించిన కొందరు.. ఆ కారు దాకా వెళ్ళి ఆమెను బయటకు తీసుకొని వచ్చారు.

ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ముక్కూ మొఖం తెలియని వ్యక్తులు ఓ మహిళ ప్రాణాలు కాపాడడం నిజంగా వారి గొప్పతనం అని అంటున్నారు నెటిజన్లు. చైనాలోని షాన్ డాంగ్ ప్రాంతం లోని జీబో నగరంలో ఇటీవల వరదలు వచ్చాయి. ఓ అమ్మాయి తన కార్ లో ఉండగా.. ఉన్నట్లుండి వరద ఉధృతి పెరిగిపోయింది. అంతేకాకుండా ఆమె చిక్కుకుపోయింది. ఆమెను చూసిన కొందరు నీటిలోకి దూకారు. మొత్తం కారు నీటి లోపల ఉండగా.. ఒక్క పైన సన్ రూఫ్ గ్లాసు మాత్రమే ఆమెను బయటకు తీయడానికి ఉన్న అవకాశం. ముందుగా ఈదుకుంటూ వెళ్ళిన ఓ వ్యక్తి ఆ అద్దాన్ని పగులగొట్టి.. ఆమెను బయటకు తీసుకొని వచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here