తనకు జరిగిన షాకింగ్ ఘటనను బయటపెట్టిన చిన్మయి..!

చిన్మయి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా తెలుగు ప్రజలకు బాగా పరిచయం ఉన్న పేరు.. పెద్ద పెద్ద స్టార్స్ కు డబ్బింగ్ చెప్పడమే కాకుండా.. సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈమె సోషల్ మీడియాతో ఆమెకు జరిగిన ఓ సంఘటనను బయటపెట్టింది. ఈ మధ్య ఓ ఈవెంట్ కు వెళ్లిన చిన్మయి శ్రీపాద అక్కడ లైంగిక వేధింపులు ఎదుర్కొంది.

ఒక వ్యక్తి… ఆమెను చేతులతో తడిమేందుకు ప్రయత్నించాడు. ఆమె వక్షోజాలను చేతితో పట్టుకునేందుకు ప్రయత్నించాడట. ఈ షాకింగ్ విషయాన్ని ఆమె ట్వీట్ చేశారు. ఎంతోమంది ఇలాంటి వేధింపులకు గురవుతారని… కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేరని ట్వీట్ చేసింది. ఆడా..మగా… ఇద్దరూ పిల్లలుగా ఉన్నప్పుడు తమ టీచర్లు, అంకుల్స్ చేతిలోనే ఇలాంటి వేధింపులకు గురయ్యే ఉంటారని అంది. కానీ అలాంటివి తల్లిదండ్రులకు చెప్పుకోలేక పోతారని చెప్పింది. చెప్పినా ఎవరూ నమ్మరని అంది.


ఆడపిల్లలు చెప్పినా కాస్త వింటారేమో కానీ… అబ్బాయిలకు ఆ ఛాన్సు కూడా లేదని అంది. ఇలాంటి బాధితులు ఇప్పటికైనా నోరు విప్పి జరిగిన సంఘటనలను ఇంట్లో వారితో షేర్ చేసుకోవాలని కోరింది. కొన్ని సందర్భాల్లో మహిళలు కూడా బాధిత మహిళలను అండగా నిలబడడం లేదని చెప్పింది. అమ్మాయిలు ఇలాంటి ఘటన గురించి ఇంట్లో చెబితే… ఆ అమ్మాయికి చదువొద్దని… ఇంట్లోనే కూర్చోబెడతారనే భయం కూడా ఉందని అంది. ధైర్యం చేసి చెప్పినా వారికి అండగా నిలవాల్సింది పోయి.. ఆమె ఎలాంటి వస్త్రాలు వేసుకుంది, లిప్‌స్టిక్, జుట్టు, స్కిన్ కలర్, దుస్తులు, ప్రవర్తన లాంటి విషయాల్లో బ్లేమ్ చేయడం పనిగా పెట్టుకున్నారని, సాటి మహిళ వేధింపులకు గురైతే మహిళలే ఇలాంటి కామెంట్ చేస్తున్నారని దయచేసి వాళ్లని బ్లేమ్ చేయడం ఆపాలని కోరారు. మిమ్మిల్ని ఎవరైనా తాకాలని ప్రయత్నిస్తే.. వెంటనే వాళ్ల చెంప పగలగొట్టండి.. మౌనంగా ఉండకండి అని చెప్పింది చిన్మయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here