హాలీవుడ్ సినిమాలో విలన్ లాగా భయంకరమైన మాస్క్ వేసుకొని షాప్ కు వచ్చాడు..!

దొంగతనాలు చేయడానికి కూడా సినిమాలను ఫాలో అయిపోతున్నారు క్రిమినల్స్.. హాలీవుడ్ సినిమా చకీ లాగా ఉన్న మాస్క్ ను వేసుకొని వచ్చిన దొంగ కత్తి తీసుకొని ఓ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తిని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా అతడిని కొట్టాలని ప్రయాణించాడు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ దొంగతనానికి, దాడికి పాల్పడిన వ్యక్తి ఒక వారం ముందే జైలులో నుండి విడుదల అయ్యాడట.

ఓస్బర్న్ వాల్టన్ ఒక వారం రోజుల కిందటే జైలులో నుండి విడుదలయ్యాడు. వాల్టన్ జైలు శిక్ష అనుభవించాక కూడా సరిగా ఉన్నాడా అంటే అదీ లేదు. దొంగతనానికి పాల్పడ్డాడు. హాలీవుడ్ సినిమాలో వాడిన మాస్క్ వేసుకొని.. ఎనిమిది ఇంచీల కత్తి పట్టుకొని ఇంగ్లాండ్లోని వెస్ట్ బ్రోమ్ విచ్ ప్రాంతంలో గల బాల్స్ వైన్స్ షాప్ లోకి ప్రవేశించాడు. షాప్ లోకి ప్రవేశించిన వాల్టన్ అక్కడ పనిచేస్తున్న వ్యక్తితో డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అయితే కౌంటర్ లో వ్యక్తి తిరగబడ్డాడు. అతడి మాస్క్ తీయడానికి ప్రయత్నించాడు. కిందపడి దొర్లాడు కూడానూ.. అయితే వాల్టన్ కత్తితో దాడి చేయాలని భావించినప్పటికీ ఆ యువకుడు ఆ కత్తిని లాగేసుకొని విసిరిపడేశాడు. ఓ వైపు అతన్ని పట్టుకొని.. మరో చేత్తో పోలీసులకు కాల్ చేశాడు. వాల్టన్ ను ఇటీవలే కోర్టులో ప్రవేశపెట్టగా 5 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. వాల్టన్ ను పట్టుకొన్న ఆ యువకుడు భారతసంతతి వ్యక్తేనట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here