మ్యాచ్ కు వెళ్ళి ఒకే ఒక్క క్యాచ్ పట్టాడు.. 22 లక్షల రూపాయలు సంపాదించాడు..!

టీ20ల్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ ల మధ్య ప్రపంచ రికార్డు చేజింగ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే..! 244 పరుగులను ఏడు బంతులు మిగిలించి ఆస్ట్రేలియా సాధించింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిసింది.

అయితే ఈ మ్యాచ్ కు ప్రేక్షకుడిగా వెళ్ళిన ఓ యువకుడు ఏకంగా 22 లక్షల రూపాయలు సంపాదించగలిగాడు. 20 ఏళ్ల మిచెల్ గ్రిమ్ స్టోన్ అనే యువకుడు సింగిల్ హ్యాండ్ క్యాచ్ పట్టి 50వేల న్యూజిలాండ్ డాలర్లను సంపాదించాడు. మొదటి ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ లో రాస్ టేలర్ కొట్టిన సిక్సర్ ను ఆ యువకుడు ఎడమ చేత్తో అందుకున్నాడు. స్థానికంగా ఉన్న కూల్ డ్రింక్ కంపెనీ అభిమానులు ఎవరైనా క్యాచ్ పడితే 50వేల న్యూజిలాండ్ డాలర్లు ప్రైజ్ మనీ ఇస్తూ ఉంటుంది. ఆ కాంటెస్ట్ లో పాల్గొనేవాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకుంటే వాళ్లకు ఆరెంజ్ కలర్ టీ షర్ట్ ఇస్తారు. వాళ్ళ అదృష్టం బాగుండి క్రికెటర్ కొట్టిన సిక్సర్ ను క్లీన్ క్యాచ్ పడితే ఆ డబ్బులు వాళ్ళకే సొంతం.

అలా ఈ మ్యాచ్ లో 19.5 ఓవర్ లో రాస్ టేలర్ కొట్టిన క్యాచ్ ను మిచెల్ గ్రిమ్ స్టోన్ అందుకున్నాడు. దీంతో అతడికి ప్రైజ్ మనీ దక్కింది. తాను సాధారణంగా లెఫ్ట్ హ్యాండర్ ను కానని తాను చేయి పెట్టగా అలా పడిపోయిందని గ్రిమ్ స్టోన్ చెప్పాడు. గ్రిమ్ స్టోన్ క్యాచ్ పట్టగానే అతడి స్నేహితుల ఆనందానికి అవధులే లేవు. ఇక రాస్ టేలర్ అతడిని అభినందిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఫోటో కూడా అప్లోడ్ చేశాడు. అలాగే తాను ఆడిన గ్లౌజ్ లు, మ్యాచ్ బాల్ అతడికి ఇచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here