చివరికి భార్యకు ఇచ్చిన ఉంగరం గురించి కూడా అబద్దాలు చెప్పిన ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే.. వారి ఎంగేజ్మెంట్ రింగ్ విషయం. చివరికి మెలానియాకు తొడిగిన డైమండ్ రింగ్ విషయంలో కూడా ట్రంప్ అబద్దాలు చెప్పినట్లు స్పష్టమైపోయింది. 1998లో మెలానియా మోడలింగ్ కెరీర్ లో భాగంగా న్యూయార్క్ కు వచ్చింది. అప్పుడే ట్రంప్ తో మెలానియాకు పరిచయం ఏర్పడింది. 2004 లో ట్రంప్ మెలానియాకు ప్రపోజ్ చేసి.. 10 క్యారట్ల డైమండ్ రింగ్ ను తొడిగాడు. ఇది లండన్ కు చెందిన గ్రాఫ్ డైమండ్స్ రూపొందించింది. అప్పట్లో దీని ధరను 1.5మిలియన్ డాలర్లు అంటే భారత్ కరెన్సీలో దాదాపు 10 కోట్ల రూపాయలు.

వ్యాపారవేత్త అయిన ట్రంప్.. తాను అంత డబ్బులు ఇవ్వలేదని.. పబ్లిసిటీలో భాగంగా తనకు ఫ్రీగా ఆ డైమండ్ రింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అలాగే 2005 లో అయితే తనకు భారీ డిస్కౌంట్ ఇచ్చినందుకే ఆ డైమండ్ రింగ్ ను కొన్నానని.. ఎవరైనా గొప్పలకు పోయి ఒక డైమండ్ రింగ్ కోసం మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తారా అని న్యూయార్క్ టైమ్స్ తో అన్నాడు.

అయితే ఈ డైమండ్ రేటు విషయంలో డైమండ్ కంపెనీ యజమాని అయిన లారెన్ గ్రాఫ్ ట్రంప్ చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నాడు. తమకు ట్రంప్ తో వ్యాపారం చేసినందుకు ఆనందపడుతున్నామని. కానీ ట్రంప్ అన్నట్లు కోట్ల రూపాయల డిస్కౌంట్ ఏదీ లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ కు ఎటువంటి ప్రత్యేక తగ్గింపులు ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ట్రంప్ తాము చెప్పిన ధరను ఒకేసారి కట్టేశాడట. అయితే దీనిపై వైట్ హౌస్ కానీ అమెరికా ప్రథమ మహిళ ఆఫీస్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఇక ట్రంప్ వారి పదో వివాహ దినోత్సవం సందర్భంగా ఏకంగా 3 మిలియన్ డాలర్ల డైమండ్ రింగ్ ను మెలానియాకు ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here