పాడుబ‌డ్డ‌ బావిలో ప‌డ్డ గున్నేనుగు!

భువ‌నేశ్వ‌ర్‌: ద‌ప్పిక‌ను తీర్చుకోవ‌డానికి వెళ్లిన ఓ గున్నేనుగు పొర‌పాటున వ్యవ‌సాయ బావిలో ప‌డింది. అదొక పాడుబ‌డ్డ బావి. కొన్నేళ్లుగా ఆ బావిని ఎవ‌రూ వినియోగించ‌ట్లేదు. మొన్న కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఓ మోస్త‌రు నీళ్లు ఆ బావిలో చేరాయి. నీటి కోసం వ‌చ్చిన ఓ గున్నేనుగు పొర‌పాటున అందులో ప‌డింది. బ‌య‌టికి వ‌చ్చే దారి లేక ఘీంకారాలు చేసింది.

ఈ ఘ‌ట‌న ఒడిశాలోని ఢెంక‌ణాల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కామాఖ్య‌న‌గ‌ర్ అట‌వీ రేంజ్‌లో ఏనుగుల సంఖ్య చాలా ఎక్కువ‌. గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయ‌వి. ఆ అట‌వీ రేంజ్ ప‌రిధిలో ఉన్న జముఝారా గ్రామంలో ఓ ఎప్పుడు ప‌డిందో తెలియ‌ట్లేదు గానీ ఓ గున్నేనుగు అందులో ప‌డింది. బ‌య‌టికి రాలేక అది చేస్తోన్న ఘీంకారాల‌ను విని స్థానికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

ఏనుగు బావిలో ప‌డ్డ విష‌యం తెలుసుకుని వెంట‌నే కామాఖ్యన‌గ‌ర్ రేంజ్ అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అట‌వీశాఖ సిబ్బంది.. దాన్ని వెలికి తీశారు. దీనికోసం క్రేన్‌ను ఉప‌యోగించారు. అనంత‌రం- వైద్య ప‌రీక్ష‌లు చేసి, పాండువా అడ‌వుల్లో వ‌దిలేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here