చెట్టును కౌగిలించుకున్న 363 మందిపై గొడ్డ‌లి వేటు ప‌డ్డ రోజు..!

అభివృద్ధి పేరుతో ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌నే ధ్యాస లేకుండా చెట్ల‌ను ఇష్టానుసారంగా న‌రికేస్తున్న రోజులివి. చెట్ల కోసం అభివృద్ధినే అడ్డుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందులో భాగంగా పుట్టుకొచ్చిందే చిప్కో ఉద్య‌మం. చిప్కో అంటే అతుక్కుపోవ‌డం.

చెట్ల‌ను న‌ర‌క‌డానికి గొడ్డ‌ళ్ల‌తో వ‌చ్చిన వారిని అడ్డుకోవ‌డానికి 363 మంంది త‌మ ప్రాణాల‌నే ప‌ణంగా పెట్టిన సంద‌ర్భాన్ని గూగుల్ గుర్తు చేసింది. 1730వ సంవ‌త్స‌ర‌లో సాగిన ఈ ఉద్య‌మాన్ని స‌రిగ్గా 1970వ ద‌శ‌కంలో మ‌రోసారి నిర్వ‌హించి, వంద‌లాది చెట్ల‌ను ప‌రిర‌క్షించారు కొంద‌రు ఉద్య‌మకారులు.

అప్ప‌ట్లో 363 మంది త‌మ ప్రాణాల‌ను కోల్పోగా.. రెండోసారి జ‌రిగిన ఉద్య‌మం గాంధేయ‌మార్గంలో సాగింది. 1730లో రాజ‌స్థాన్‌లో జోధ్‌పూర్ రాజు అభయ్‌సింగ్ బికనీర్‌కు సమీపంలో ఉన్న బిష్ణోయి ప్రాంతంలో ఖేజర్లీ అనే చెట్లు న‌రికి తీసుకుని రావాల‌ని ఆదేశించాడు. బిష్ణోయ్ కుల‌స్తుల‌కు ఖేజ‌ర్లీ చెట్లు దైవ‌స‌మానం.

ఖేజ‌ర్లీ చెట్ల‌ను న‌ర‌క‌డానికి వ‌చ్చిన వారిని బిష్ణోయ్ మ‌హిళ‌లు అడ్డుకున్నారు. అమృతాదేవి అనే మ‌హిళ ఈ ఉద్య‌మానికి నేతృత్వం వ‌హించారు. వంద‌ల సంఖ్య‌లో ఉన్న ఖేజ‌ర్లీ చెట్ల‌పై గొడ్డ‌లి వేటు ప‌డ‌కుండా వాటికి అతుక్కుపోయారు. అయిన‌ప్ప‌టికీ.. అభ‌య్‌సింగ్ సైనికులు నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రించారు. మ‌హిళ‌ల‌తో స‌హా చెట్ల‌నూ న‌రికివేశారు.

ఇలా 1730వ ద‌శ‌కంలోనే 363 మంది మ‌హిళ‌లు.. చెట్ల కోసం త‌మ ప్రాణాల‌ను అర్పించారు. న‌ర్మ‌దా బాచావో ఆందోళ‌న్ సంద‌ర్భంగా ఇదే త‌ర‌హా ఉద్య‌మాన్ని స‌రిగ్గా 45 సంవ‌త్స‌రాల కింద‌ట ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోనూ చేప‌ట్టారు. 1973లో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మండ‌ల్ గ్రామంలో మ‌రోసారి చెట్ల‌ను కౌగిలించుకునే ఉద్యమం జ‌రిగింది.

దీనికి చండీప్ర‌సాద్ భ‌ట్ అనే వ్య‌క్తి నాయ‌క‌త్వం వ‌హించారు. ద‌షోలి గ్రామ స్వ‌రాజ్య సంఘ్ స‌హ‌క‌రించింది. అప్పుడే దీనికి చిప్కో ఆందోళ‌న్ అని పేరు పెట్టారు. చిప్కో ఉద్య‌మం మొద‌లైన రోజును పుర‌స్క‌రించుకుని గూగుల్ త‌న డూడుల్ ద్వారా వారి త్యాగాన్ని గుర్తు చేసింది. స్వ‌భు కోహ్లీ, విప్ల‌వ్ సింగ్‌లు ఈ డూడుల్‌ను రూపొందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here