సగానికిపై కాలిన మృత‌దేహం: త‌ల‌పై హెల్మెట్

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని నౌపాడ జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌గానికి పైగా కాలిన ఓ వ్య‌క్తి మృత‌దేహం జిల్లాలోని ఖ‌డియాలా ప‌ట్ట‌ణ స‌మీపంలోని రాణిపూర్ గ్రామంలో ల‌భించింది. రాణిపూర్ గ్రామానికి ఆనుకుని ఉన్ బండియా అట‌వీ ప్రాంతంలో ప‌డి ఉన్న ఈ మృత‌దేహాన్ని మొద‌ట స్థానిక రైతులు గుర్తించారు.

 

70 శాతానికి పైగా కాలిపోయి క‌నిపించింది. దీన్ని చూసిన వెంట‌నే వారు ఖ‌డియాలా పోలీస్‌స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎవ‌ర‌నే విష‌యం తెలియ‌కుండా ఉండ‌టానికి హెల్మెట్‌తో స‌హా స‌జీవ ద‌హ‌నం చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

తాము ఈ మృత‌దేహాన్ని చూసే స‌మ‌యానికి అది ఇంకా కాలుతూనే క‌నిపించింద‌ని రైతులు చెబుతున్నారు. హ‌తుడు ఎవ‌రనే విష‌యం ద‌ర్యాప్తులో తేలుతుంద‌ని చెప్పారు. మృత‌దేహం చుట్టుప‌క్క‌ల ఎలాంటి అనుమానిత వ‌స్తువులు గానీ, మృతుడి మొబైల్ ఫోన్ గానీ దొరక‌లేద‌ని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here