వ‌ణికిన ఒంటిమిట్ట‌..ఇద్ద‌రి మృతి! క‌డ‌ప‌లోనే ఉన్న చంద్ర‌బాబు

క‌డ‌ప‌: ప్రాచీన ఒంటిమిట్ట రాములోరి ఆల‌యంలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాలకు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈదురు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం బీభ‌త్సం సృష్టించింది. ఏక‌ధాటిగా ఈదురుగాలులు, వ‌డ‌గండ్ల వ‌ర్షం దెబ్బ‌కు కోదండ‌రామ‌స్వామి ఆల‌యం స‌మీపంలోని ఓ వృక్షం నేల కూలింది.

షార్ట్‌స‌ర్క్యూట్ సంభ‌వించ‌డం వ‌ల్ల ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. అత‌ణ్ని బ‌ద్వేలు నుంచి వ‌చ్చిన భ‌క్తుడిగా చెబుతున్నారు. అన్నదాన సత్రం వద్ద మరో మహిళ గుండెపోటుతో మరణించారు. మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. షార్ట్‌స‌ర్క్యూట్ వ‌ల్ల విద్యుత్ ప్ర‌సారానికి అంత‌రాయం ఏర్ప‌డింది.

ఫ‌లితంగా- ఒంటిమిట్ట‌లో అంధ‌కారం అల‌ముకుంది. ఈదురు గాలుల‌కు షామియానాలు చెల్లాచెదుర‌య్యాయి. వేడుకల్లో పాల్గొనడానికి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌డ‌ప ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లోనే ఉన్నారు.

వర్షం త‌గ్గిన త‌రువాత ఆయ‌న ఒంటిమిట్టకు వెళ్తార‌ని అధికారులు వెల్ల‌డించారు. ఆల‌యానికి వెలుప‌ల ఏర్పాటు చేసిన దుకాణాల‌కు అమ‌ర్చిన రేకులు గాలికి ఎగిరిపోయాయి. అవి మీద ప‌డ‌టంతో భాస్కర్‌, ధనుంజయ్‌ నాయుడు అనే భ‌క్తులు గాయ‌ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here