ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వెంకటలక్ష్మిని ఎందుకు చంపాడో బయటపెట్టిన సాగర్..!

రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో దారుణహత్యకు గురైన వెంకటలక్ష్మిని ఎందుకు చంపాడో ఆమెనే ప్రేమించిన సాగర్ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ మాజీ డీసీపీ రంగనాథ్‌ ఇంట్లో పనిచేస్తున్న హోంగార్డుగా పనిచేస్తున్న మిడికొండ సాగర్‌ ఆమెను హత్య చేసిన కొన్ని గంటల్లోనే అదుపు లోకి తీసుకున్నారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో ఉన్న అతడు వెంకటలక్ష్మిని తాను ప్రేమించానని కానీ కొన్ని కారణాల వలన చంపేయాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. తామిద్దరికి చాలాకాలంగా పరిచయం ఉందని, ఇద్దరమూ ప్రేమించుకున్నామని, కలసి తిరిగామని, పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వెంకటలక్ష్మి తల్లిదండ్రులను సంప్రదించానని చెప్పాడు. అయితే తనది తక్కువ కులమని వెంకటలక్ష్మి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో, అప్పటి నుంచి వెంకటలక్ష్మి తనను పక్కన పెట్టిందని అన్నాడు.

అయితే ఆమె మరో యువకుడికి దగ్గరైందని, వారిద్దరూ కలసి ఉండటాన్ని చూసిన తాను భరించలేకపోయానని, ఆ కోపంతోనే దుకాణానికి వెళ్లి వెంకటలక్ష్మిని నిలదీశానని చెప్పాడు. ఆమె తన యజమానికి ఫోన్ చేయడంతో పోలీసులు వస్తారని భయపడి గొంతు కోసి చంపేశానని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here