చెల్లెల్ని బ్రతికుండగానే ఇక్కడ పాతిపెట్టిన అన్న.. నిజం తెలుసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ కు నిద్రపట్టలేదు..!

కొన్ని దారుణాలు ఎంత ఘోరంగా ఉంటాయంటే.. అవి తెలుసుకున్న వాళ్లకు కూడా ఆ ఘటనే మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని ఓ ఐపీఎస్ అధికారికి ఎదురైంది. సొంత చెల్లెల్ని బ్రతికుండగానే పాతి పెట్టిన అన్న.. ఎందుకు చంపాడో.. ఎలా చంపాడో ఐపీఎస్ అధికారికి తెలిపాడు. ఇది తెలుసుకున్న ఆయనకు నిద్ర కూడా పట్టలేదట.

 

సొంత తండ్రి, అన్న కలిసి ఆ యువతిని చంపేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్పీ సంతోష్ మిశ్రా ఈ హత్య గురించి నిజాలను బయటపెట్టాడు. కేవలం పరువు కోసమే ఆ యువతిని తండ్రి, అన్న కలిసి తుపాకీతో కాల్చేశారు. ఇంకా ప్రాణాలతో ఉండగానే ఓ చోట పాతి పెట్టారు.

జహంగీర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి లోని బస్ హియా గ్రామానికి చెందిన 16 సంవత్సరాల దీపాంజలి ఓ యువకుడిని ప్రేమించింది. అతడితో ఎక్కడికో పారిపోయింది. 10 రోజుల తర్వాత ఆమెను ఇంటికి తీసుకొని వచ్చారు. పరువు తీసింది అన్న కోపంతో తండ్రి, అన్న దీపాంజలిని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ తర్వాత తుపాకీతో కాల్చి ఆమెను గ్రామంలో ఓ చోటుకు తీసుకొని వెళ్ళి పాతేశారు.

గతంలో దీపాంజలి అన్న వికాస్ సింహ పోలీసులకు తన చెల్లెలు కనిపించడం లేదని కేసు పెట్టాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆమె ఇంటికి చేరుకుంది. ఆమె ఇంటికి చేరుకున్న తర్వాతి రోజే మరోసారి ఆమె కనపడడం లేదని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు వికాస్.. దీంతో ఎస్పీ.. ఐపీఎస్ ఆఫీసర్ అయిన సంతోష్ మిశ్రా కేసు విచారణ బాధ్యతలను తన మీద వేసుకున్నాడు. రెండు రోజుల అనంతరం వికాస్ ను విచారించగా అతడు చెప్పింది విని తనకు నిద్ర పట్టలేదని చెప్పాడు సంతోష్ మిశ్రా.

పరువు తీసేసిన దీపాంజలి వలన కుటుంబానికి ఎంతో చెడ్డపేరు వచ్చిందని.. దాని ముఖం చూడబుద్ధి కూడా కాలేదని అందుకే చంపేయాలని తానూ, తన తండ్రి అనుకున్నామని వికాస్ చెప్పాడు. తనను తుపాకీతో కాల్చిన తర్వాత కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే తాము చూస్తూ ఉండిపోయామని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత గ్రామం లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో తనను పాతిపెట్టి వచ్చామని చెప్పాడు. తాము పాతిపెట్టే సమయానికి అప్పటికి ఇంకా బ్రతికే ఉందని వికాస్ బయటపెట్టాడు. పరువు కోసం ఎంతకైనా తెగిస్తారని ఐపీఎస్ అధికారి సంతోష్ మిశ్రా చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here