ల‌క్కున్నోడు: రాత్రికి రాత్రి రూ.20 కోట్లు సంపాదించాడు!

న‌క్క తోక తొక్కి వ‌చ్చాడో, లేదో తెలియదు గానీ.. ఆ వ్య‌క్తి మాత్రం ఒక్క దెబ్బ‌కు 20 కోట్ల రూపాయ‌ల‌ను ఆర్జించాడు. రాత్రికి రాత్రి కోటీశ్వ‌రుడ‌య్యాడు.

ఆ ల‌క్కున్నోడి పేరు హ‌రికృష్ణ‌న్ వి నాయ‌ర్‌. మ‌ల‌యాళీ. కేర‌ళ‌కు చెందిన హ‌రికృష్ణ‌న్ 2002 నుంచి త‌న కుటుంబంతో స‌హా అబుధాబిలో నివాసం ఉంటున్నాడు.

అబుధాబిలో నిర్వ‌హించిన బిగ్ టికెట్ రాఫెల్ డ్రా అత‌ని జీవితాన్ని మార్చివేసింది. ఆదివారం ఉద‌యం నిర్వ‌హించిన ఈ డ్రాలో హ‌రికృష్ణ విజేత‌గా నిలిచాడు.

12 మిలియ‌న్ దిర్హామ్ మొత్తాన్ని గెలుచుకున్నాడు. అత‌ని బిగ్ టికెట్ నంబ‌ర్ 086828. ఈ నంబ‌ర్‌కు లాట‌రీ త‌గిలింది. ఈ డ‌బ్బుల‌తో ఏం చేస్తావ‌ని అడ‌గ్గా.. ప్ర‌పంచాన్ని చుట్టేసొస్తాన‌ని అంటున్నాడు హ‌రికృష్ణ‌న్‌.

భార్య నిషా హ‌రి, కుమారుడితో క‌లిసి ప్ర‌పంచం మొత్తం చుట్టి రావాల‌ని ఎప్ప‌ట్నుంచో ఆశ‌గా ఉంద‌ని, ఈ మొత్తంతో తాను ప్ర‌పంచ దేశాల్లో ప‌ర్య‌టిస్తానని అన్నాడు.

 

Lottery tickets for sale.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here