అపోలో పై షాకింగ్ వార్త బయటపెట్టిన శశికళ సోదరుడు.. రామ్ చరణ్ భార్య ఉపాసన తాతపై ఆరోపణలు..!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు రావాలి. వాటిలో చాలా తక్కువ అంశాలు మాత్రమే బయటకు వచ్చాయి. తాజాగా మరో షాకింగ్ వార్తను శశికళ సోదరుడు దివాకరన్ బయట పెట్టాడు.


జయలలిత డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం 5.15నిమిషాలకే చనిపోయిందని.. అపోలో యాజమాన్యం డిసెంబర్ 5వ తేదీ రాత్రి ఆమె చనిపోయినట్లు ప్రకటించిందని ఆయన గుర్తు చేశాడు. కావాలనే ఆమెకు చికిత్స చేస్తున్నట్లు అపోలో యాజమాన్యం ప్రవర్తించిందని దివాకరన్ వెల్లడించాడు. మన్నార్‌గుడిలో ఓ సమావేశంలో దివాకరన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అమ్మ చనిపోయిన రోజు తాను ఆసుపత్రిలోనే ఉన్నానని, డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.15 నిమిషాలకు ఆమెకు గుండెపోటు రావడంతో మరణించిందని చెప్పాడు. ఆమె చనిపోయిన తర్వాత మెషిన్‌పైన ఉంచారని.. ఎందుకలా ఉంచుతున్నారని తాను ఆసుపత్రి అధినేత రెడ్డి(ప్రతాప్ సి రెడ్డి) ని నిలదీశానని దివాకరన్ చెప్పాడు. తమిళనాడులో తమ బ్రాంచీలు చాలా ఉన్నాయని, వాటి భద్రతకు సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే తాము జయలలిత చనిపోయినట్లు ప్రకటిస్తామని అపోలో చైర్మన్ తనతో చెప్పినట్లు దివాకరన్ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here