మ‌హాన్యూస్ మూర్తికి, పీఓడ‌బ్ల్యూ సంధ్య‌కూ.. వార్నింగ్‌!

హైద‌రాబాద్‌: టాలీవుడ్ బండారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోన్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మ‌రింత రాజుకుంది. ఈ విష‌యంలో జీవిత రాజ‌శేఖ‌ర్ పేరు కూడా రావ‌డంతో ఆమె ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. త‌న పేరును ఎందుకు తెచ్చారంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఈ విష‌యంలో మ‌హాన్యూస్ మూర్తి, పీఓడ‌బ్ల్యూ సంధ్య‌ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

వారికి నోటీసుల‌ను జారీ చేస్తామ‌ని అన్నారు. త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్‌కు జీవితే అమ్మాయిల‌ను స‌ర‌ఫ‌రా చేస్తారంటూ పీఓడ‌బ్ల్యూ సంధ్య ఇటీవ‌లే ఆరోపించారు. దీనిపై జీవిత అసాధార‌ణంగా రియాక్ట్ అయ్యారు.

త‌న‌పై ఆరోప‌ణ‌ల‌ను చేసిన సంధ్య‌పై ఆధారాలు ఏమున్నాయ‌ని ప్ర‌శ్నించ‌కుండా.. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ నిజ‌మ‌ని న‌మ్మేలా మహా న్యూస్ మూర్తి గారికి ప్ర‌వ‌ర్తించార‌ని జీవిత ఆరోపించారు. ఛానెల్ ఉంది కదా అని రెచ్చిపోయి, ఏమైనా మాట్లాడగలం అనుకోవద్దని సంధ్య‌కు చుర‌క‌లు అంటించారు.

కాస్టింగ్ కౌచ్ మీద వేయబోయే కమిటీలో తాను ఒక సభ్యురాలిగా ఉండబోతున్నానని తెలిసి, దాని వల్ల వారికేదో అన్యాయం జరుగుతుందని ఊహించి, ఇలా తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. పేరు బ‌య‌టికి వ‌చ్చిన వెంట‌నే బ‌య‌టికి రాలేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. తాను సెంట్రల్ సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా ఉండట‌మేన‌ని, పబ్లిసిటీ కోసం ఎగబడే వారిపై స్పందించడం ఇష్టంలేక ఊరుకున్నట్టు జీవిత తన ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here