బాలుడి మ‌ర్మాంగంపై పెట్రోలు పోసి మంట పెట్టిన శాడిస్ట్ ఎస్ఐ!

దొంగ‌తనం చేశాడ‌నే అనుమానంతో ఓ బాలుడిపై త‌న ప్ర‌తాపాన్ని చూపాడో ఎస్ఐ. బాలుడి మ‌ర్మాంగంపై పెట్రోలు పోసి మంట పెట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆ బాలుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పురలో చోటు చేసుకుంది. ఆ ఎస్ఐ పేరు ఆరిఫ్ ముష‌ర‌ఫ్‌.

జిల్లాకేంద్ర‌మైన విజ‌య‌పురలోని గాంధీచౌక్ పోలీస్‌స్టేష‌న్‌లో ఎస్ఐ. న‌గ‌ల‌ను దొంగిలించాడ‌నే నెపంతో సూర‌జ్ (పేరుమార్చాం) అనే 12 ఏళ్ల బాలుడిని గాంధీచౌక్‌ పోలీస్‌స్టేష‌న్‌కు తీసుకొచ్చారు ముగ్గురు కానిస్టేబుళ్లు. చ‌ట్ట‌ప‌రంగా విచార‌ణ జ‌ర‌పాల్సిన ఎస్ఐ దారుణానికి తెగించాడు. బాలుడిని ఇష్టానుసారంగా కొట్టారు.

అత‌ని మ‌ర్మాంగంపై పెట్రోలు పోసి మంట‌పెట్టారు. అదే స‌మయంలో పోలీస్‌స్టేష‌న్‌లో ఉన్న ఇత‌ర సిబ్బంది ఎస్ఐని అడ్డుకున్నారు. వెంట‌నే మంట‌ల‌ను ఆర్పివేశారు.

అయిన‌ప్ప‌టికీ.. బాలుడి మ‌ర్మాంగంపై కాలిన గాయాల‌య్యాయి. వెంట‌నే సూర‌జ్‌ను జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here