ర‌క్తం కారుతోంద‌ని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాడు.. ముక్కులో నుంచి తీసిన దాన్ని చూసి బిగుసుకుపోయాడు!

ప‌దిరోజులుగా ముక్కులో నుంచి త‌ర‌చూ ర‌క్తం కారుతోంద‌ని ఓ ఈఎన్‌టీ స్పెష‌లిస్ట్ క్లినిక్‌కు వెళ్లాడో వ్య‌క్తి. ర‌క్తం ఎందుకొస్తోంద‌నే విష‌యాన్ని మొద‌ట‌గా అడిగి తెలుసుకున్నాడు డాక్ట‌ర్. త‌నకు తెలిసిన ప్ర‌శ్న‌ల‌ను సంధించ‌గా.. అవేవీ కాద‌ని స‌మాధానం ఇచ్చాడా పేషెంట్‌. స‌రే! స్పెషలిస్ట్ అయిన త‌న‌కే తెలియ‌కుండా ర‌క్తం ఎలా వ‌స్తుంద‌నే అనుమానం డాక్ట‌ర్‌ను ఆవ‌రించింది.

అత‌ణ్ని టేబుల్ మీద కూర్చోబెట్టి ముక్కులో లైటు వేసి చూశాడు డాక్ట‌ర్‌. లోన ఏదో ఉబ్బెత్తుగా క‌నిపించింది. మ‌రింత ప‌రీక్షించి చూశాడు. త‌న క‌ళ్ల‌ను తానే న‌మ్మ‌లేక‌పోయాడు. ఆ వ్య‌క్తి ముక్కులో క‌నిపించిన జీవి.. జ‌ల‌గ‌. అత‌ని ముక్కు దూలానికి అంటుకుపోయింది. చిన్న సైజు ప‌ట్ట‌కారతో ముక్కులో నుంచి జ‌ల‌గ‌ను బ‌య‌టికి తీశాడు డాక్ట‌ర్‌. దాన్ని ఇద్ద‌రూ భ‌యంతో బిగుసుకుపోయారు.

సుమారు రెండు ఇంచుల కంటే పొడవైన జ‌ల‌గ అది. కొద్దిరోజుల కింద‌ట అత‌ను ఓ చెరువుకు స్నానం చేయ‌డానికి వెళ్ల‌డట‌. ఆ సంద‌ర్భంగా అది ముక్కులోనికి దూరి ఉంటుంద‌ని చెబుతున్నాడ‌త‌ను. చైనాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. ఆ దేశానికి చెందిన చాంగ్షా లీగ‌ల్ అండ్ లెజిస్లేష‌న్ చానెల్ దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here