కత్తి మహేష్ తల్లి గురించి రెండు నిమిషాలు మాట్లాడమని అడిగాడు.. వెళ్ళిపోయిన కత్తి మహేష్..!

కత్తి మహేష్.. ప్రతి రోజూ ఏదో ఒక టీవీ ఛానల్ లో లైవ్ లో మాట్లాడుతూ ఉంటూనే ఉంటాడు. తనకు పవన్ ఫ్యాన్స్ కు మధ్య వార్ అంటూ ఏదేదో చెబుతూ ఉంటాడు. తాజాగా కత్తి మహేష్ ఏకంగా లైవ్ లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అందుకు కారణం ఓ దర్శకుడు కత్తి మహేష్ తల్లి గురించి రెండు నిమిషాల పాటూ మాట్లాడమని అడిగాడు. చాలా సేపు మౌనంగా ఉన్న కత్తి మహేష్ చివరికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

మీ తల్లి గురించి కొన్ని మాటల్లో వివరించాలని రచయిత దర్శకుడు వివేక్ కోరగా కత్తి మహేష్ నేను చెప్పను అని కాసేపటి వరకు మౌనం పాటించి వాదించేందుకు ఇష్టపడకుండా వెళ్లిపోయారు. కత్తి మహేష్ 10 నిముషాలు కూడా ఆ షోలో ఉండలేకపోయాడు. దీంతో వివేక్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి తల్లి అంటే ఎంతో గౌరవం. వారి తల్లి మంచి వారే అయ్యి ఉంటారు. అయితే అతనికి స్త్రీల పట్ల ఎంత గౌరవం ఉందో తెలుసుకోవడానికి మాత్రమే ఆ ప్రశ్నను అడిగాను అని. అయితే అందుకు సమాధానం చెప్పకుండా ఆయన వెళ్లిపోవడం ఏమిటని తెలిపారు. అంతే కాకుండా తన తల్లి గురించే చెప్పుకోలేని వాడు సమాజం గురించి ఏం మాట్లాడతాడు. బయటివారి పర్సనల్స్ గురించి ఈయన అడగవచ్చు కానీ వేరే వాళ్లు మాత్రం అతన్ని ఏమి అడగకూడదు అనేలా ప్రవర్తిస్తున్నాడు అని వివేక్ తెలిపారు. ఆ వీడియో మీకోసం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here