రామ్ చరణ్ పక్కన నటించిన నటిని నైటీలో రమ్మన్న దర్శకుడు..!

మాహీ గిల్.. బాలీవుడ్ నటి రామ్ చరణ్ తో కలిసి ‘జంజీర్’ సినిమాలో నటించింది. అదేనండి ‘తూఫాన్’.. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్రం. ఈ సినిమాలో మాహీ గిల్ కూడా ఓ ముఖ్య పాత్రనే పోషించింది. ఇప్పుడు ఆమె తనకు జరిగిన ఓ విషయాన్ని బయటపెట్టింది. క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్న ఆమెకు ఎదురవ్వగా.. తనను ఓ డైరెక్టర్ నైటీలో రమ్మని అడిగాడని చెప్పుకొచ్చింది.

‘ఒక సినిమా ఛాన్స్ విషయంలో నేను అతడిని మీట్ కావాల్సి వచ్చింది. నేను మామూలు సల్వార్ కమీజ్‌లో వెళ్లాను. పాత్ర తీరు తెన్నులను చెప్పని ఆ దర్శకుడు.. నువ్వు నైటీలో ఎలా ఉంటావో చూడాలని ఉంది అని అన్నాడు. ఇలా సల్వార్ కమీజ్‌లో చూసి అవకాశం ఇవ్వలేను, నైటీలో నువ్వెలా ఉంటావో చూసి, సినిమా ఛాన్స్ ఇస్తానని అతడు మాట్లాడాడని..’ చెప్పుకొచ్చింది. తాను ఆ తర్వాత ఆ సినిమా గురించి పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. మొత్తం ఘటన గురించి చెప్పిన మాహీ గిల్.. ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here