ర‌న్నింగ్‌లో రైలెక్క‌బోయాడు..ప‌ట్టు త‌ప్పాడు!

తెలంగాణ‌లోని మంచిర్యాల రైల్వేస్టేష‌న్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. సంక్రాంతి పండక్కి ఊరెళ్లి, స‌ర‌దాగా గడ‌పాల‌నుకున్న అత‌ని క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి.

రైలు ఎక్కే ప్ర‌య‌త్నంలో ఓ యువ‌కుడు ప‌ట్టుత‌ప్పాడు. రైలు కింద ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో అత‌ని కాలు పూర్తిగా తెగిపోయింది. శ‌నివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

గాయ‌ప‌డ్డ యువ‌కుడి వివ‌రాలు తెలియ‌రావాల్సి ఉంది. మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కే ప్ర‌య‌త్నంలో ఆ యువ‌కుడు ప‌ట్టుత‌ప్పి రైలుకు, ప్లాట్‌ఫాం మ‌ధ్య ఉన్న ఖాళీ స్థ‌లంలో ప‌డిపోయాడు.

అదే స‌మ‌యంలో రైలు క‌ద‌ల‌డంతో అత‌ని కాలు తెగిపోయింది. వెంట‌నే ఆ యువ‌కుడు స్పృహ కోల్పోయాడు. తోటి ప్ర‌యాణికులు అత‌ణ్ణి ర‌క్షించారు. మంచిర్యాల ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here