మెడికో ఆత్మ‌హ‌త్య‌..పోస్ట్‌మార్టం చేయొద్ద‌న్న బంధువులు..స‌ర్దిచెప్పిన పోలీసులు!

వైద్య విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ర్నూలులో క‌ల‌క‌లం రేపింది. క‌ర్నూలు మెడిక‌ల్ క‌ళాశాల‌లో పీజీ చేస్తోన్న విష్ణుప్రియ అనే మెడికో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

తాను జీవితంలో ఓడిపోయాన‌ని, పిరికితనంతో చనిపోతున్నాని, త‌న‌ చావుకు ఎవరూ బాధ్యులుకార‌ని అంటూ ఆమె రాసిన‌ట్టుగా భావిస్తోన్న డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంత‌పురానికి చెందిన విష్ణుప్రియ క‌ర్నూలులో త‌న పిన్ని ఇంట్లో ఉంటూ పీజీ చ‌దువుతున్నారు. చాణ‌క్య‌పురిలో ఉన్న పిన్ని ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆమె ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

సాయంత్రం ఇంటికి వ‌చ్చిన విష్ణుప్రియ పిన్ని దీన్ని గ‌మ‌నించి..ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు ధృవీక‌రించారు.

ఆత్మ‌హ‌త్య విష‌యాన్ని విష్ణుప్రియ బంధువులు చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఎవ‌రికీ వెల్ల‌డించ‌లేదు. పోలీసుల‌కు తెలిసిన త‌రువాత వారు.. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్ట‌మ్ కోసం త‌ర‌లించ‌బోతుండ‌గా అడ్డుకున్నారు.

పోస్ట్‌మార్ట్ చేయ‌క‌పోతే అనేక అనుమానాలు వ‌స్తాయంటూ పోలీసులు స‌ర్దిచెప్ప‌డంతో అంగీక‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై క‌ర్నూలు త్రీటౌన్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here