మ‌ర్మాంగం క‌త్తిరించి..దారుణ‌హ‌త్య‌: ఆ చ‌ర్యే హంత‌కుల‌ను పట్టిచ్చింది!

మ‌ర్మాంగం క‌త్తిరించిన స్థితిలో పోలీసులకు ల‌భించిన ఓ మృత‌దేహం క‌ల‌క‌లం రేపింది. మ‌ర్మాంగాన్ని క‌త్తిరించిన చ‌ర్యే.. ఈ ఘ‌ట‌న వెనుక ఉన్న కార‌ణాల‌ను వెలుగులోకి తీసుకొచ్చింది. అనుమానితుల‌ను అదుపులోకి తీసుకునేలా చేసింది.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మైసూరు జిల్లాలో చోటు చేసుకుంది. హ‌తుడి పేరు మ‌హేష్‌. జిల్లాలోని హుణ‌సూరుకు చెందిన 45 సంవ‌త్స‌రాల మ‌హేష్‌ వివాహితుడు. భార్యాపిల్ల‌లు ఉన్నారు.

అయిన‌ప్ప‌టికీ.. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న ఓ మ‌హిళతో వివాహేతు సంబంధాన్ని పెట్టుకున్నాడు. వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న మ‌హిళ‌తో క‌లిసి హుణ‌సూరులోని రంగ‌నాథ లే అవుట్‌లో నివాసం ఉంటున్నాడు.

ఈ విష‌యం భార్య‌, ఆమె త‌ర‌ఫు బంధువుల‌కు తెలిసింది. దీనితో వారు త‌ర‌చూ మ‌హేష్‌తో ఘ‌ర్ష‌ణ ప‌డుతుండేవారు. ఈ నేప‌థ్యంలో.. గురువారం సాయంత్రం మ‌హేష్ దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడు. అత‌ని మ‌ర్మాంగాన్ని క‌త్తిరించారు.

ఒంటిపైనా గాయాలు ఉన్నాయి. దీనితో- హుణ‌సూరు పోలీసులు మొద‌ట మ‌హేష్ భార్య‌, ఆమె త‌ర‌ఫు బంధువుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here