నవాజ్ షరీఫ్ కు మామూలు షాక్ ఇవ్వలేదుగా..!

ప్రస్తుతం పాకిస్థాన్ లో రాజకీయ అనిశ్చితి మొదలైంది. నవాజ్ షరీఫ్ ను ఎప్పుడైతే ప్రధాని పదవి నుండి తీసేయడంతో ఆ దేశ రాజకీయాల్లో కొన్ని కుదుపులకు లోనయ్యాయి. అయితే ఇప్పుడు ఆ దేశ సుప్రీం కోర్టు మరో షాకింగ్ న్యూస్ ను నవాజ్ షరీఫ్ చెవిన పడవేసింది. అతడి రాజకీయ జీవితమే నాశనం అయ్యేలా తీర్పును ఇచ్చింది ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం. ఎన్నికల్లో పోటీ చేయకూడదని.. అలాగే ఎలాంటి బహిరంగ సభల్లో కూడా పాల్గొనకూడదని ఆదేశించింది. షరీఫ్ తో పాటు పాకిస్థానీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ప్రధాన కార్యదర్శి జహంగీర్ తరీన్ పై కూడా జీవితకాల నిషేధం విధించింది.

నవాజ్ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకూడదని.. అలాగే ఎలాంటి బహిరంగ సభల్లో కూడా పాల్గొనకూడదని ఆదేశించింది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్) ప్రకారం ఆయనపై ఈ మేరకు నిషేధం విధించింది. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ నిషేధం సరైనదేనని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడడంతో నవాజ్ అనుచరులు జుట్టుపీక్కుంటున్నారు. పనామా పేపర్ల వ్యవహారం నవాజ్ ను ఇంతకు దిగజారుస్తాయా అని అక్కడి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. పనామా పేపర్స్ కేసుకు సంబంధించి ఆస్తుల వివరాలను ప్రకటించడంలో నవాజ్ షరీఫ్ విఫలం అయ్యాడు. దీంతో గత ఏడాది పాక్ సుప్రీంకోర్టు ఆయనను ప్రధాని పదవి నుంచి తొలగించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here