చర్యకు ప్రతి చర్య ఉంటుందని నితిన్ ట్వీట్..!

పవన్ కళ్యాణ్ అభిమానులు.. పవన్ ను ఒక హీరోగా కంటే అంతకు మించిన అభిమానంతో చూస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు తాము భక్తులమే అని చెబుతారు. అకారణంగా పవన్ కళ్యాణ్ ను శ్రీ రెడ్డి అంతేసి మాటలు అనడం నిజంగా దారుణంగా అనిపిస్తోంది తెలుగు సినీ అభిమానులకు. ఆమె మీద ఇప్పటికే చాలా మంది ఫైర్ అయ్యారు. అసలు ఏ అర్హతతో నువ్వు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నావు అని అభిమానులు అంటూ ఉన్నారు. నీ ఉద్యమం ఏమిటో నువ్వు చేసుకుంటూ ఉన్నావు.. అలాంటి దానివి పవన్ ను లాగడం అవసరమా అని అడుగుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు బడుతున్నారు.


తాజాగా పవన్ వీరాభిమాని హీరో నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “For every action there is an equal and opposite reaction…just wait for it….its coming!!!” అని ట్వీట్ పెట్టాడు.

న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని, దానికోసం వేచి చూడాలని అన్నాడు. ప్రతిచర్య వస్తోందని హెచ్చరించాడు. ఈ ట్వీట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద అన్న మాటకు వ్యతిరేకంగానే అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికే రియాక్షన్ భారీగా ఉందని శ్రీ రెడ్డికి అర్థం అయిపోయి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here