సెక్యూరిటీ గార్డు చేతికి తుపాకీ ఇస్తే..అత‌నేమో!

భువ‌నేశ్వ‌ర్‌: అత‌నో సెక్యూరిటీ గార్డు. ఓ పారిశ్రామిక వేత్త ఇంటికి కాప‌లా కాయ‌డం అత‌ని బాధ్య‌త‌. బ‌డా పారిశ్రామికవేత్త సంస్థ‌కు, ఇంటికి బాడీగార్డుగా ప‌నిచేస్తున్నాడంటే.. ఖ‌చ్చితంగా అత‌ని చేతికి తుపాకీ ఇచ్చి తీరుతారు. దాన్ని విధి నిర్వ‌హ‌ణ కోసం ఉప‌యోగించాలే గానీ.. చేతిలో ఉంది క‌దాని భార్య‌ను కాల్చేస్తే ఎట్టా? ఈ సెక్యూరిటీ గార్డు అదే ప‌ని చేశాడు.

చేతిలో తుపాకీ ఉంది క‌దాని భార్య‌ను కాల్చి హ‌త‌మార్చాడు. ఒడిశాలోని భ‌ద్ర‌క్ జిల్ల‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు అన్న‌పూర్ణ పుహానా. ఆ హంత‌కుడి పేరు గౌత‌మ్ పుహానా. భ‌ద్ర‌క్ న‌గ‌ర శివార్ల‌లోని అర్జున్‌పూర్‌లో నివాసం ఉండేవారు. గౌత‌మ్ పుహానా సెక్యూరిటీ గార్డు. అజ‌య్ అగ‌ర్వాల్ అనే పారిశ్రామిక‌వేత్త వ‌ద్ద ప‌నిచేస్తుండేవాడు.

 

అత‌ని వ‌ద్ద లైసెన్స్‌డ్ రివాల్వ‌ర్ ఉంది. మంగ‌ళ‌వారం ఉద‌యం భార్య అన్న‌పూర్ణ‌తో గొడ‌వ‌ప‌డ్డ గౌత‌మ్‌.. త‌న వ‌ద్ద ఉన్న రివాల్వ‌ర్ తీసి కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో ఆమె త‌ల‌లో బుల్లెట్లు దూసుకెళ్లాయి.

తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఆమెను స్థానికులు భ‌ద్ర‌క్ జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డ చికిత్స పొందుతూ అన్నపూర్ణ మ‌ర‌ణించింది. ఈ ఘ‌ట‌నపై స్థానికులు ధుసూరి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు గౌత‌మ్‌ను అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద ఉన్న గ‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here