కుక్క పిల్ల పక్కన కూర్చొని.. దానికి బిస్కెట్లు తినిపించిన పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమలకు కాలినడకన వెళ్ళి వచ్చారు. రాత్రి 9 గంటల నుంచి కాలినడకన కొండపైకి చేరుకుని, హంపీ మఠంలో బసచేశారు. ఆపై ఈ ఉదయం స్వామివారిని దర్శించుకుని వచ్చారు. అయితే ఆయన కాలినడకన వెళ్ళే సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు ఆయన వెనుక నడిచారు.

చాలా చోట్ల పవన్ కళ్యాణ్ ఆగి ఆగి వెళ్ళారు. ఒక చోట కుక్క పిల్ల పక్కన కూర్చొన్న పవన్ కళ్యాణ్.. దానికి కొన్ని బిస్కెట్లు కూడా ఇచ్చారు. ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఉదయం స్వామివారిని దర్శించుకుని వచ్చిన ఆయన పర్యటన పూర్తి వ్యక్తిగతమని జనసేన వర్గాలు వెల్లడించాయి. మూడు రోజుల పాటు మఠంలోనే పవన్ ఏకాంతంగా ఉంటారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు రోజుల పాటు పవన్ ఎవరినీ ప్రత్యేకంగా కలవబోరని, ఎటువంటి చర్చలూ ఉండవని తెలిపాయి.ఎంతో కాలంగా ఆయన తిరుమలలో మూడు నిద్రలు చేయాలని భావిస్తూ వచ్చారని, ఈ మేరకు ఆయనకో మొక్కు ఉందని, ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించాలన్న నిర్ణయం తీసుకున్న ఆయన, అంతకన్నా ముందు మొక్కు తీర్చుకోవాలని భావించారని జనసేన వర్గాలు వెల్లడించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here