ఆమెను చంపిందెవ‌రో తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు!

చెన్నై: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్నది జంట పేర్లు జ్ఞాన‌ప్రియ‌, ప్ర‌భు ఆలియాస్ బాల గ‌ణేష్‌. నాలుగేళ్ల‌ కింద‌టే వారికి పెళ్ల‌యింది. చెన్నై వ‌డ‌ప‌ళ‌ణిలో నివాసం. కొద్దిరోజుల కింద‌టే జ్ఞాన‌ప్రియ దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. హంత‌కుడి కోసం ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసుల‌కు ఊహించని ట్విస్టులు ఎదుర‌య్యాయి. ఈ హ‌త్యోదంతంలో జ్ఞాన‌ప్రియ భ‌ర్తే నిందితుడ‌ని తేలింది.

పోలీసులు అత‌ణ్ని అరెస్టు చేశారు. మొద‌ట బుకాయించిన‌ప్ప‌టికీ.. పోలీసులు త‌మదైన శైలిలో విచారించ‌డంతో అస‌లు విష‌యాన్ని అంగీక‌రించాడు. బాల‌గ‌ణేష్‌.. వృత్తిరీత్యా అర్చ‌కుడు. వ‌డ‌ప‌ళ‌ణిలోని ఓ ఆల‌యంలో పూజారి. పెళ్ల‌యిన నాలుగేళ్ల‌యిన‌ప్ప‌టికీ వారికి పిల్ల‌లు క‌ల‌గ‌లేదు. ఈ విష‌యంపై త‌ర‌చూ బాల‌గ‌ణేష్‌ త‌న భార్య‌తో గొడ‌వ ప‌డేవాడు.

కొడుతుండేవాడు. ఈ నెల 4వ తేదీన కూడా ఘ‌ర్ష‌ణ ప‌డ్డ బాల‌గ‌ణేష్‌.. జ్ఞాన‌ప్రియ‌ను కొట్టి చంపాడు. ఆమె మృత‌దేహాన్ని బాత్‌రూమ్‌లో ప‌డేశాడు. త‌న భార్య హ‌త్య‌కు గురైన‌ట్లు క‌థ అల్లాడు.

అంత్య‌క్రియ‌ల కోసం మృత‌దేహాన్ని హ‌డావుడిగా త‌న స్వ‌గ్రామానికి తీసుకెళ్లాడు. దీనిపై జ్ఞాన‌ప్రియ త‌ల్లిదండ్రుల‌కు అనుమానం రావ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనితో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బాల‌గ‌ణేష్ త‌న నేరాన్ని అంగీక‌రించాడు. 4వ తేదీన రాత్రి సుత్తితో కొట్టి జ్ఞాన‌ప్రియ‌ను హ‌త్య చేసిన‌ట్టు చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here