మరోసారి తన నిజాయితీని చాటుకున్న ద్రావిడ్..!

భారత క్రికెటర్లలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే రాహుల్ ద్రావిడ్ అనే చెబుతారు. ఎందుకంటే ఆయన మీద ఎటువంటి నెగటివ్ ఫీలింగ్ ప్రజలకు కలగదు కాబట్టి. ఏది చేసినా నిజాయితీగా ప్రవర్తించడం రాహుల్ కు ముందు నుండే అలవాటు అయింది. తాజాగా ఓ విషయం మీద బీసీసీఐకి లేఖ రాశారు ద్రావిడ్.. అదేమిటంటే బెంగళూరులో నిర్మితమైన ‘పదుకొణే-ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌’ కేంద్రం గురించి.

బెంగళూరులో నిర్మితమైన ఈ అకాడమీలో బ్యాడ్మింటన్, క్రికెట్, టెన్నిస్, స్వాష్, ఫుట్‌బాల్, స్మిమ్మింగ్‌ నేర్పిస్తారు. పేరు విన్న ఎవరైనా కూడా ఓహో.. ఇది ద్రావిడ్ కు సంబంధించిన అకాడమీ అని అనుకుంటారు. కానీ దానికి కేవలం తన పేరును మాత్రమే వాడుకున్నారని ఎటువంటి సంబంధం కూడా లేదని స్పష్టం చేసేశారు. ఈ అకాడమీకి ప్రకాశ్ పదుకొణే పేరును కూడా వాడుకున్నారని.. ఆయనకు,తనకు ఎలాంటి లావాదేవీలు ఆ సెంటర్ తో లేవని స్పష్టం చేశారు.

వరల్డ్ కప్ టూర్ కు బయల్దేరకముందే ద్రవిడ్ బీసీసీఐకి దీనిపై స్పష్టమైన సమాచారంతో లేఖ రాసినట్టు బీసీసీఐ అధికారి తెలిపారు. ద్రవిడ్ సమాచారం ఇచ్చాడని నిర్ధారించిన బీసీసీఐ, ఈ విషయంలో ద్రవిడ్‌ కు ఎలాంటి సమస్యలేదని చెప్పాడు. ఆ సంస్థలో కానీ, ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు ద్రావిడ్. కొద్ది రోజుల క్రితం భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ గెలిచినప్పుడు కోచ్ గా ఉన్న ద్రావిడ్ కు అధిక మొత్తంలో డబ్బులు నజరానాగా ఇచ్చారు.. అయితే అందరికీ సమానంగా ఇవ్వాలని ఆయన సూచించి తన పెద్ద మనసును చాటుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here