47రోజులు బాత్ రూమ్ కు ఎప్పుడు వెళతాడా అని ఎదురుచూసిన పోలీసులు.. ఇక చేసేది లేక..!

జనవరి 17, ఎసెక్స్ లోని హార్లోలో 24 సంవత్సరాల లామర్ చాంబర్స్ ను అరెస్ట్ చేశారు. అతడు డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతడు బాత్ రూమ్ కి వెళితే అతడు తీసుకున్న డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయనేది పోలీసుల వాదన. అయితే ఈ విషయం పసిగట్టిన చాంబర్స్ ఇప్పటి దాకా బాత్ రూమ్ కే వెళ్ళలేదు. దాదాపు 47 రోజుల పాటూ.. అతడు ఎప్పుడు బాత్ రూమ్ కి వెళతాడా అని పోలీసులు ఎదురుచూశారు. కానీ అలా జరగకపోవడంతో పోలీసులు అతన్ని విడుదల చేశారు.

ఇప్పటికే చాలా రోజులు అయిందని.. ఇంకా ఎక్కువ రోజులు తన క్లయింట్ బాత్ రూమ్ కి వెళ్ళకుండా ఉండగలడని.. అయితే అది అతడి ప్రాణాలకే ప్రమాదమని కోర్టులో వాదించాడు. దీంతో అతడు ఎక్కడ చచ్చిపోతాడోనని భావించిన న్యాయమూర్తి అతన్ని విడుదల చేయమని తీర్పును ఇచ్చాడు. ఎసెక్స్ పోలీసులు ఇక చేసేదేమీ లేక అతన్ని విడిచిపెట్టేశారు. అతడు క్లాస్-ఏ డ్రగ్స్ ను తీసుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నామని చెప్పారు. తమను చూసి వాటిని మింగేశాడని పోలీసులు ఆరోపించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. తాను లెట్రిన్ కు వెళ్లేదే లేదని భీష్మించుకు కూర్చోవడంతో 47రోజులైనా పోలీసులకు సాక్ష్యాలు లభించలేదు. ప్రస్తుతం చాంబర్స్ ను ఆసుపత్రికి తరలించారు. అన్ని రోజులు ‘పూ స్ట్రైక్’ చేసి ఎలా బ్రతకగలిగావయ్యా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here