మార్కెట్ లోకి రానున్న రాయల్ ఎన్ ఫీల్డ్ సరికొత్త బైక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!

రాయల్ ఎన్ ఫీల్డ్.. ప్రస్తుతం ఈ బైక్ లకు డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. త్వరలో మరో రెండు బైక్ లు మార్కెట్ లోకి విడుదల కాబోతున్నాయి. అవి థండర్ బర్డ్ 350X, 500X.. విడుదల చేసే రోజును ఫిబ్రవరి 28గా నిర్ణయించారు. ఈ కొత్త థండర్ బర్డ్ బైక్ లు 2017 ఆఖరుకు అందుబాటులోకి వస్తాయని అందరూ భావించారు అయితే ఈ నెల చివరి రోజున ముహూర్తం నిర్ణయించారు.

పాత థండర్ బర్డ్ ఇంజన్ దీనికి కూడా ఉన్నప్పటికీ ముఖ్యంగా సీటింగ్, హ్యాండిల్ విషయంలో భారీ మార్పులే చేసింది రాయల్ ఎన్ఫీల్డ్. ఈ బైక్ కు అలాయ్ వీల్స్ తో పాటుగా.. ట్యూబ్ లెస్ టైర్లు కూడా ఉన్నాయి. అలాగే ఎల్.ఈ.డీ. డే టైమ్ రన్నింగ్ బైక్.. ఎల్.ఈ.డీ. టైల్ ల్యాంప్ లు కూడా ఇచ్చారు. థండర్ బర్డ్ 350X ఎరుపు, తెలుపు రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ మాత్రమే ఆ రంగుల్లో ఉంటుంది. ఇక థండర్ బర్డ్ 500X పసుపు, నీలం రంగుల్లో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. మరికొన్ని రంగుల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం ఉన్న థండర్ బర్డ్ బైక్ ల రేటుతో పోలిస్తే కొత్తగా రానున్న ఈ థండర్ బర్డ్ బైక్ లు కాస్త ఎక్కువ రేటేనని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు 5000 రూపాయలు ధర పెరగవచ్చట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here