లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నారు.. గృహప్రవేశం ముందు పుట్టవెలిసింది.. పుట్టలో నాగరాజు..!

కొన్ని లక్షలు పెట్టి ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకుంటున్నారు. గృహప్రవేశానికి మరి కొన్ని రోజులు మాత్రమే ఉండగా ఆ ఇంట్లో ఓ పుట్ట వెలిసింది. అందులో నాగరాజు కూడా ప్రత్యక్ష్యం అయ్యాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలోని బిదర హొసహళ్ళి గ్రామంలో చోటుచేసుకుంది.

మహేష్ ఎనిమిది నెలల క్రితం ఇళ్ళు కట్టడం ప్రారంభించాడు. అప్పుడు చిన్న పుట్ట వెలిసింది. దీంతో అతడు ఆ పుట్టను తీసివేయించాడు. అయితే అదే ప్రాంతంలో మరోసారి పుట్ట వెలిసింది. మొదట పుట్ట తీసివేసినప్పుడు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వడమే కాకుండా అతడి పిల్లలకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. దీంతో రెండో సారి పుట్టను తీసివేసే ధైర్యం చేయలేకపోయాడు మహేష్. ఇక చేసేది ఏమీ లేక గృహప్రవేశాన్ని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతానికి ప్రతి రోజూ పూజలు చేస్తూ ఉన్నారు. ఓ రెండు మూడు సార్లు తమకు నాగుపాము కనిపించిందని వారు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here