స్పాలో మసాజ్ చేయించుకుంటూ ఉండగా అగ్నిప్రమాదం.. ఇక తప్పించుకోవాలంటే ఒకటే మార్గం..!

స్పాలో అందరూ మసాజ్ చేయించుకుంటూ ఉండిపోయారు. ఇంతలో అగ్నిప్రమాదం సంభవించింది.. మసాజ్ చేయించుకుంటున్న చాలా మంది బట్టలు కూడా వేసుకోలేదు. ఓ వైపు స్పాలో మంటలు పెరిగిపోతున్నాయి.. బట్టలు వేసుకొని దిగాలా.. లేక ప్రాణాలతో కిందకు వెళ్ళిపోతే చాలా.. అన్న సంశయంలో రెండో ఆప్షన్ నే సెలెక్ట్ చేసుకున్నారు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా కిందకు దిగేశారు స్పా కస్టమర్లు.. పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదని బాధపడిపోతున్నారు.

చైనాలోని యి కౌంటీలో చోటుచేసుకుంది. నగ్నంగా ఉన్న స్పా కస్టమర్లకు ఓ నిచ్చెన వేసి కిందకు దించారు. వారంతా దొరికిన తువాలును ఉపయోగించి ఒంటికి చుట్టుకొని కిందకు దిగేశారు. మరికొందరు ఏమీ లేకుండానే కిందకు వచ్చేశారు. మంటలను అగ్నిమాపక బృందం ఓ గంట పాటూ కష్టపడి ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. అయితే మర్యాదకు, పరువుకు మాత్రమే భంగం కలిగాయని తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై అధికారులు విచారిస్తూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here