వెక్కి వెక్కి ఏడ్చిన స్టీవ్ స్మిత్.. క్రికెట్ చాలా గొప్ప గేమ్.. తప్పు చేశాం.. క్షమించండి..!

స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాలో మీడియా ముందు హాజరయ్యారు. తాను చాలా తప్పు చేశానని.. ఎవరి మీద నిందలు వేయాల్సిన అవసరం లేదని.. మొత్తం బాధ్యత తనదేనని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన జరగడం వలన ఆస్ట్రేలియా క్రికెట్ తలదించుకుందని.. అంతే కాకుండా తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు.

“ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకూ, ఆస్ట్రేలియన్లకు క్షమాపణలు చెబుతున్నా.. కేప్ టౌన్ లో జరిగినదానికి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా నేనే బాధ్యతను వహిస్తున్నాను. తాను జీవితంలో మరచిపోలేని తప్పు చేశానని.. ఇప్పుడు దాని పరిణామాలు అనుభవిస్తూ ఉన్నాను.. నాయకుడిగా తాను ఆ సమయంలో ఓడిపోయానని.. తాను చేసిన తప్పును సరిదిద్దుకోడానికి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. తమకు విధించిన శిక్ష చాలా మందికి ఓ పాఠం కావాలని.. తన పరిస్థితి చూశాక ఎవరూ బాల్ టాంపరింగ్ కు పాల్పడకూడదని” స్మిత్ ఏడుస్తూ చెప్పాడు.

ఈ ఘటనతో తాను చాలా క్రుంగిపోయానని.. భవిష్యత్తులో తాను మీ అందరితో మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తానని.. క్రికెట్ తన జీవితమని దాన్ని విడిచిపెట్టలేనని చెప్పాడు. తనను క్షమించండి అని కోరాడు స్టీవ్ స్మిత్.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here