భ‌ర‌త్ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. ఆకాశ‌మే హ‌ద్దు!

హైద‌రాబాద్‌/అమ‌రావ‌తి: సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను విడుద‌లై స‌రిగ్గా వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో ఎక్క‌డే గానీ క‌లెక్ష‌న్ల సునామీ త‌గ్గ‌లేదు. మ‌రింత పెరుగుతోంది. వారం రోజుల్లో భ‌ర‌త్ అనే నేను సాధించిన క‌లెక్ష‌న్లు 161 కోట్ల 28 ల‌క్ష‌ల రూపాయ‌లు.

బాహుబ‌లికి త‌ప్ప మ‌రే సినిమాకూ సాధ్యం కాని రికార్డు ఇది. ఏడు రోజులైన‌ప్ప‌టికీ..క‌లెక్ష‌న్లు స్ట‌డీగా, కొన్ని చోట్ల మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌టంతో రెండోవారంలో అడుగు పెట్టే స‌రికి 200 కోట్ల రూపాయ‌ల మార్క్‌ను అందుకోవ‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఈ సినిమా ఇచ్చిన అపూర్వ విజ‌యంతో మ‌హేష్ ఉత్సాహంతో ఉన్నారు. శుక్ర‌వారం ఉద‌యం విజ‌య‌వాడ క‌న‌క దుర్గ‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించారు. అదే రోజు సాయంత్రం తిరుప‌తికి చేరుకున్నారు. తిరుప‌తిలో ఆయ‌న అభిమానులు మంగ‌ళ‌హార‌తి ఇచ్చి ఆహ్వానించ‌డం.. మ‌హేష్ మేనియాను స్ప‌ష్టం చేస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here