ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీక‌రించి జిమ్ చేస్తూ అల‌సిన ఈ టాలీవుడ్ టాప్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?

కొద్దిరోజులుగా క్రికెట‌ర్లు, ఫిల్మ్‌స్టార్‌ల‌ను ఫిట్‌నెస్ ఛాలెంజ్ జ్వ‌రం ప‌ట్టుకుంది. కేంద్ర‌మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు సెలబ్రిటీల నుండి అనూహ్య స్పందన వస్తోంది. భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో క్రీడామంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌‌ను సోషల్ మీడియాలో ప్రారంభించారు.

ఇప్పటికే ఈ ఫిట్‌నెస్ చాలెంజ్‌లో భాగంగా హృతిక్‌ రోషన్‌, విరాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌‌, దీపికా పదుకొనే, అఖిల్ అక్కినేని, నాగ చైతన్య, సమంత, రకుల్ ప్రీత్ తదితరులు జిమ్‌లో కసరత్తులు చేసే ఫోటోలు, వీడియోలనే షేర్ చేశారు.

తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’లో భాగస్వామ్యం అవుతూ.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోను షేర్ చేసి.. ఇదిగో నా ఫిట్ నెస్ మీరూ నిరూపించుకోండి అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఫిట్ నెస్ సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను ఎన్టీఆర్ స్వీక‌రించారు. జిమ్ చేస్తూ, చేస్తూ అల‌సిపోయి, దాని మీద సోలిపోయారు. త‌మ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిందిగా ఎన్టీఆర్‌.. మ‌హేష్‌బాబు, క‌ల్యాణ్‌రామ్‌, ఎస్ఎస్ రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్‌, శివ కొర‌టాల‌కు ఛాలెంజ్ విసిరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here