అతడి చేతిలోని తోడేలు మనిషిని చూసి అందరూ తెగ టెన్షన్ పడ్డారు..!

ఐ సినిమాలో విక్రమ్ ఒక పాటలో ఓ జంతువుగా మారుతాడు కదా.. అచ్చం ఆ జంతువు పిల్ల ఉన్నట్లు లేదూ..! న్యూయార్క్ లోని సబ్ వే ప్రయాణీకులు ఓ వ్యక్తి చేతిలో దీన్ని చూసి తెగ టెన్షన్ పడ్డారు. ఓ తోటి ప్రయాణీకుడు అక్కడ అతడి చేతిలో ఉన్న దాన్ని చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కొందరు ఇదేదో హాలీవుడ్ సినిమాల్లో ఉండే ‘తోడేలు మనిషి’ పిల్లనా అని కూడా అడిగారు. నిజమైన పిల్లనేమో అని కూడా కొందరు నమ్మేశారు. సబ్ వే ప్రయాణీకులు అతడి పక్కన కూర్చోవడానికి కూడా భయపడిపోయారు. చాలా సేపటి తర్వాత గానీ అందరూ అది బొమ్మ అన్న క్లారిటీకి రాలేకపోయారు. చిన్న సైజ్ తోడేలు మనిషి బొమ్మను ఒళ్లో పెట్టుకొని అతడు న్యూయార్క్ సబ్ వే లో అలజడి అయితే సృష్టించగలిగాడు.

ఆ బొమ్మకు నల్ల కళ్ళు, పదునైన పళ్ళు, పెద్ద చెవులు ఉన్నాయి.. అలాగే దాని ఒంటి మీద ఆర్మీ డ్రెస్ కూడా ఉంది. అలాంటి బొమ్మ ఎక్కడ దొరుకుంతో కనుక్కోవాలని కొందరు సోషల్ మీడియా యూజర్లు ఫోటోల కింద కామెంట్లు చేశారు. ఇలాంటి బొమ్మను చూసి చాలా రోజులైందని కామెంట్లు కూడా చేశారు. గతంలో కొందరు సెలెబ్రిటీల వద్ద అచ్చం ఇలాంటి బొమ్మే ఉందని గుర్తుచేశారు కొందరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here