వ‌ర్కింగ్ విమెన్స్ హాస్టళ్లే టార్గెట్‌: ల‌వ‌ర్ చెప్పాడ‌ని..దొంగ‌గా మారిన యువ‌తి!

త‌న ల‌వ‌ర్ చెప్పాడ‌ని చోరీలు చేయ‌డం మొద‌లు పెట్టిందో యువ‌తి. వ‌ర్కింగ్ విమెన్స్ హాస్ట‌ళ్ల‌కు వెళ్ల‌డం, త‌న‌కూ అందులో రూమ్ కావాల‌ని నిర్వాహ‌కుల‌తో చెప్ప‌డం, అక్క‌డున్న ల్యాప్‌టాప్‌ల‌ను ఎత్తుకెళ్ల‌డం.. ఇదీ ఆమె ప‌ని.

ఇలా 10 ల్యాప్‌టాప్‌ల‌ను చోరీ చేసింది. చివ‌రికి పోలీసుల చేతికి చిక్కింది. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. 23 సంవ‌త్స‌రాల ఆ యువ‌తి పేరు శోభ. కొద్దిరోజులుగా ఆమె నిఖిల్ (పేరుమార్చాం) అనే యువ‌కుడిని ప్రేమిస్తోంది.

అత‌నితో క‌లిసి విలాస‌వంతంగా గ‌డ‌ప‌డానికి డ‌బ్బులు కావాల్సి వ‌చ్చింది. దీనితో నిఖిల్ చెప్పిన సూచ‌నల మేర‌కు ల్యాప్‌టాప్‌ల‌ను చోరీ చేయ‌డం మొద‌లు పెట్టింది. వ‌ర్కింగ్ విమెన్స్ హాస్ట‌ళ్ల‌ను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేసింది.

తాను ఐటీ ఉద్యోగిని అని, గ‌ది కావాలంటూ వెళ్లేది. రూమ్‌ల‌ను చూసే నెపంతో.. అక్క‌డున్న ల్యాప్‌టాప్‌ల‌ను చోరీ చేసేది. ఇలా 10 ల్యాప్‌టాప్‌ల‌ను చోరీ చేసింది. దీనిపై ఫిర్యాదును అందుకున్న మేఖ్రీ స‌ర్కిల్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితురాలిని గుర్తించారు.

ఆమెను అరెస్టు చేశారు. నిఖిల్ ప‌రారీలో ఉన్నాడు. శోభ వ‌ద్ద నుంచి 10 ల్యాప్‌టాప్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here